విరాళాల్లోనూ ట్రంప్, బైడెన్ పోటీ.. ఎవరికి ఎంతంటే?

-

అమెరికా అధ్యక్ష పీఠం కోసం ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో మరోసారి నిలిచిన అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఈ ఇరువురు నేతలు విరాళాలు సేకరించడంలోనూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి తాము 192 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించినట్లు జో బైడెన్‌ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. ఒక్క మార్చి నెలలోనే 90 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.750 కోట్లు) పైగా విరాళాలను సమీకరించినట్లు పేర్కొంది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపేనని వివరించింది.

మరోవైపు విరాళాల సేకరణలో డెమోక్రటిక్‌ పార్టీకి రిపబ్లికన్‌ పార్టీ శనివారం నిర్వహించిన ఒక్క కార్యక్రమంతోనే 50.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.420 కోట్లు) సమీకరించినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార బృందం ప్రకటించింది.  బైడెన్‌ బృందం రేడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌ కార్యక్రమంలో సమీకరించిన దానితో పోలిస్తే ఇది రెండింతలు. త్రైమాసికం ముగిసే నాటికి తమ వద్ద 93.1 మిలియన్‌ డాలర్ల నిధులు ఉన్నట్లు ట్రంప్‌ బృందం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version