ఆ దేశంలో మాస్క్ ధరించకపోతే సమాధికి గోతులు తవ్వాలి..

-

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి మాస్క్ తప్పనిసరి. ఐతే ఐదున్నర నెలలుగా పట్టి పీడిస్తున్న ఈ వైరస్, ఎప్పుడు విడిచిపెడుతుందో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో చాలామంది మాస్కులు పెట్టుకోవడం మానేస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే మాస్కులు పెట్టుకుంటే మా స్వేఛ్ఛని హరించినట్టే అని, ఆ హక్కు మీకు లేదంటూ నిరసనలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే మనదేశంలో మాస్క్ ధరించకపోతే జరిమానాలు ఉన్నాయి.

ఇలా చాలా దేశాల్లో జరిమానాలున్నాయి. కానీ తాజాగా ఇండోనేషియాలో మాస్క్ పెట్టుకోనందున వాళ్ళు విధించిన శిక్ష అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఇండోనేషియాలో తూర్పు జావాలో ఎనిమిది మంది యువకులు మాస్క్ పెట్టుకోనందున, అక్కడి స్థానిక ప్రభుత్వం వారందరినీ సమాధులు నిర్మించడానికి గోతులు తవ్వమని చెప్పింది. కరోనాతో చనిపోతున్న వారికి గోతులు తవ్వాలని శిక్ష విధించింది. కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించనందున ఇలాంటి చర్యలు తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version