రాజకీయాల్లో ఇమ్రాన్ ఖాన్​​పై బ్యాన్.. ఎందుకంటే?

-

పాక్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు అక్రమంగా విదేశీ నిధులు అందినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ఆరోపించింది. వాస్తవానికి ఈ అంశంపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ విదేశాల నుంచి నిధులు అందుకొందని తాజాగా పాక్‌ ఎన్నికల కమిషన్‌ రూలింగ్‌లో పేర్కొంది. దీంతో ఇప్పుడు ఇమ్రాన్‌, ఆయన పార్టీని పాక్‌ రాజకీయాల నుంచి బ్యాన్‌చేసే అవకాశం ఉంది. పాక్‌ రాజకీయ పార్టీలు విదేశీ నిధులు స్వీకరించడంపై నిషేధం ఉంది.

పాక్‌ ఎన్నికల కమిషన్‌ రూలింగ్‌ను తాము సవాలు చేస్తామని పీటీఐ (పాకిస్థాన్‌ తెహ్రీ ఇ ఇన్సాఫ్‌) ప్రతినిధి ఫవాద్‌ చౌధురి విలేకర్లకు వెల్లడించారు. తాము విదేశాల్లోని పాక్‌ జాతీయుల నుంచే నిధులు సేకరించామని ఆయన వెల్లడించారు. ఇదేమీ చట్ట విరుద్ధం కాదన్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ 2018లో అధికారం చేపట్టి.. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాత చట్టసభలో మద్దతు కోల్పోవడం వల్ల రాజీనామా చేశారు. అమెరికా కుట్రకారణంగానే తాను పదవి పోగొట్టుకొన్నానని ఆయన ఆరోపించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ మొత్తం 34 విదేశీ కంపెనీల వద్ద పార్టీ ఫండ్‌ పొందినట్లు ముగ్గురు సభ్యుల ట్రిబ్యూనల్‌ తేల్చింది. తమ పార్టీకి మొత్తం 13 ఖాతాలు ఉన్నాయని.. వాటి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. మరోవైపు ఈసీ నుంచి పీటీఐకి నోటీస్‌ పంపింది. ఇమ్రాన్‌ ఖాన్‌పై ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి పీటీఐ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న అక్బర్‌ ఎస్‌.బాబర్‌ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version