ప్రపంచమంతా కరోనా మహమ్మారి దెబ్బకి వణికిపోతుంది. భారత్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయితే కేసులు నమోదవుతున్న స్థాయిలోనే రికవరీ కేసులు కూడా ఉండటం ఊరటనిస్తోంది. ఈ విషయాన్ని ప్రఖ్యాత జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ కూడా చెప్పుకొచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ప్రపంచంలో భారతీయులే అత్యధికులని వెల్లడించింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 37,80,107 మంది కోలుకున్నారని వివరించింది. రికవరీ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని యూనివర్సిటీ పేర్కొంది. అలాగే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4,926,914 కేసులు నమోదవ్వగా.. 80,827 మంది మరణించారు.