ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్ లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. మెరికా తర్వాత మన దేశంలోనే కరోనా కేసులు ఆ రేంజ్ లో ఉన్నాయి. కరోనా కట్టడిలో కూడా భారత్ చాలా వేగంగా దూసుకుపోతుంది. రికవరీల విషయంలో భారత్ లో చాలా మెరుగ్గా రికవరీ రేటు కనపడుతుంది. ఇప్పటి వరకు దేశంలో 37 లక్షలకు పైగా ప్రజలు కోలుకున్నారు.
సోమవారం, భారతదేశం బ్రెజిల్‌ను అధిగమించి… ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ -19 రికవరీలను నమోదు చేసింది. 37,80,107 మంది నేటి వరకు కోలుకున్నారు అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అందించిన సమాచారం ప్రకారం వెల్లడి అయింది. భారతదేశ కోవిడ్ రికవరీ రేటు 78 శాతంగా ఉందని పేర్కొంది. ప్రపంచంలో 1, 96, 25,959 మంది కరోనావైరస్ నుంచి కోలుకున్నారు.