ఇజ్రాయెల్‌ భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాల.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

-

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు జారీ చేసింది. ఆ దేశంలో ఉన్న భారత పౌరులంతా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలని అడ్వైజరీ జారీ చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. భారత పౌరుల ప్రయాణాలకు సంబంధించి లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీచేసిన మరుసటి రోజు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం మన పౌరులను అప్రమత్తం చేసింది.

ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు జాగ్రత్తగా వ్యవహరించండని అడ్వైజరీలో పేర్కొంది. దేశంలో అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండాలని తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. మన దేశ పౌరుల భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించింది. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ అడ్వైజరీ జారీ చేసి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లను పోస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version