ఇజ్రాయెల్​కు మద్దతుగా భారత్ హ్యాకర్స్.. పాలస్తీనా, హమాస్‌ వెబ్​సైట్స్ హ్యాక్

-

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌-హమాస్ పోరులో ఇరు దేశాలకు చెందిన వేల మంది మృత్యువాత పడుతున్నారు. మరెన్నో వేల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. ఓవైపు ఇజ్రాయెల్​పై యుద్ధభూమిలో విరుచుకుపడుతున్న పాలస్తీనా, హమాస్.. మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ హ్యాకర్ల సాయంతో ఇజ్రాయెల్​ కీలక వెబ్​సైట్లపై విరుచుకుపడుతున్నాయి.

ఇజ్రాయెల్​తో పోరులో పాలస్తీనా, హమాస్‌ తిరుగుబాటుదారులకు మద్దతుగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సహా మరికొన్ని దేశాల హ్యాకర్లు రంగంలోకి దిగారు. వారిని ఢీ కొట్టడానికి ఇజ్రాయెల్​కు మద్దతుగా రంగంలోకి దిగిన భారత హ్యాకర్ల బృందం పాక్, బంగ్లాలకు గట్టి షాకిచ్చింది. పాలస్తీనా, హమాస్‌లకు చెందిన కీలక వెబ్‌సైట్‌లను హ్యాక్‌ చేసింది.

పాలస్తీనా, హమాస్‌కు మద్దతుగా ఓపీఇజ్రాయెల్‌, ఓపీఇజ్రాయెల్‌2 పేరుతో మిస్టీరియస్‌ టీమ్‌ బంగ్లాదేశ్‌, అనానమస్‌ సూడాన్‌, టీమ్‌ ఇన్‌సాన్‌ పాకిస్థాన్‌ హ్యాకర్ల బృందాలు.. ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలు, ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై సైబర్‌ దాడులకు విఫలయత్నం చేశాయి. సైబర్‌ దాడులు జరగకుండా ఇజ్రాయెల్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లను జియో లాకింగ్‌ చేసి ఉండటంతో.. వాటి ఆట సాగలేదు.

మరోవైపు ‘ఇండియన్‌ సైబర్‌ ఫోర్స్‌’ అనే భారత హ్యాకర్స్ టీమ్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా పాలస్తీనా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు హమాస్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసింది. పాలస్తీనా వెబ్‌ మెయిల్‌ ప్రభుత్వ సర్వీస్‌, పాలస్తీనా జాతీయ బ్యాంకు వెబ్‌సైట్‌, పాలస్తీనా టెలీ కమ్యూనికేషన్‌ కంపెనీలతో పాటు హమాస్‌ అధికారిక వెబ్‌సైట్‌లను తాము హ్యాక్‌ చేసినట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version