కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ప్రావిన్స్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది భరతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం రెండో వారంలోకి చేరుకున్నాయి.
ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. “భారత్ నుంచి పెద్ద సంఖ్య విద్యార్థులు చదువుకోవడానికి కెనడా దేశానికి వెళ్తున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా కావటంతో ప్రాధాన్యం ఉంది. అయితే వందలాది విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి ఇంకా రాలేదు. దానిపై తాజా సమీకణాలు కూడా మాకు ఏం అందలేదు. వాటిపై ఎటువంటి అవగాహన లేదు. అక్కడక్కడ ఒక విద్యార్థికి అలా జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కెనడాలోని భరతీయ విద్యార్థులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నట్లు ఎటువంటి పెద్ద సమస్య కనిపించటం లేదు” అని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.