అమ్మాయిల పెళ్లి వయసు 9 ఏళ్లకు తగ్గింపు!

-

ఆడపిల్లలకు 18 ఏళ్లు దాటిన తర్వాతే వివాహం జరిపించాలని చట్టం చేసినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా బాల్యవివాహాలు సాగుతున్నాయి. కానీ ఓ దేశం మాత్రం ఏకంగా అమ్మాయిల వివాహ వయసును 9 సంవత్సరాలకు కుదించాలంటూ పార్లమెంట్‌లో బిల్లు ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ బిల్లుపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

పర్సనల్‌ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో ఇరాక్ ప్రభుత్వం దీనిని తీసుకువచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇరాక్‌లో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉండగా.. ఈ బిల్లు పాస్‌ అయితే బాలికలు 9 ఏళ్లు, బాలురు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. ఈ బిల్లు లింగ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బిల్లు బాలికల విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. దీనివల్ల చదువు మధ్యలో ఆపే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని, చిన్నవయసులోనే గర్భం దాల్చడం, గృహహింస వంటివి పెచ్చుమీరతాయని ఆగ్రహం వ్యక్తంచేశాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version