Niharika Konidela : చీరకట్టులో నిహారిక.. సిగ్గే సింగారమాయే

-

బుగ్గే బంగారమా.. సిగ్గే సింగారమా.. అగ్గే రాజేసెనమ్మా.. మెగాడాటర్ నిహారిక కొణిదెల లేటెస్ట్ పిక్స్ చూసి నెటిజన్లు ఇదే పాట పాడుకుంటున్నారు. చీరకట్టులో ఈ భామ అందం చూసి మెస్మరైజ్ అవుతున్నారు. క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. శారీలో చాలా అందంగా ఉన్నావ్ నిహా అంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.

ఇక నిహారిక కెరీర్ సంగతికి వస్తే.. ఈ భామ ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇంకోవైపు సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తూ కొత్త వాళ్లకు ఛాన్సులు ఇస్తోంది. కొత్త కథలను టాలీవుడ్ కు పరిచయం చేస్తుంది. తాజాగా నిహారిక ప్రొడక్షన్ లో కమిటీ కుర్రోళ్లు సినిమా రిలీజ్ అయింది. ఇవాళ థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో నిహారిక ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ కోసం ఈ భామ చీరలను ఎంచుకుంది. సంప్రదాయంగా చీరకట్టులో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా చీరకట్టులో ఫొటోషూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version