ఇజ్రాయెల్ హమాస్ల మధ్య భీకర పోరు సాగుతోంది. హమాస్ను అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాపై విరుచుకు పడుతున్న ఇజ్రాయెల్పై హమాస్ ఎదురుదాడికి దిగుతోంది. మరోవైపు హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీని ఇజ్రాయెల్ మట్టుపెట్టడంపై ఆ సంస్థ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన బందీల విడుదల కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేసింది. ఇక ఈ విషయంలో తగ్గేదేలే అని తెగేసి చెప్పేసింది.
అరౌరీ హత్యపై హమాస్ మరో అగ్రనేత ఇస్మాయిల్ హనియే మాట్లాడుతూ ఈ హత్యను ఉగ్రచర్యతో పోల్చాడు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ధిక్కరించిందన్నాడు. ఈ దాడికి ముందు హమాస్, ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందన్న వాదనలు వినిపించగా ఇప్పుడు అరౌరీ మరణంతో ఆ చర్చలు ఇక ఉండవని స్పష్టం అవుతోంది.
బీరుట్లో అరౌరీపై డ్రోన్ దాడి సమాచారాన్ని గోప్యంగా ఉంచిన ఇజ్రాయెల్ తన మిత్రదేశమైన అమెరికాతోనూ పంచుకోలేదు. దీనిపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ పెదవి విప్పలేదు. అయితే ఎటు వంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది.