ఒకే వేదికపై జో బైడెన్-కమలా హ్యారిస్.. డెమోక్రాట్లలో జోష్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నుంచి తప్పుకున్న ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, అదే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఈ ఘటన తర్వాత మొదటిసారిగా ఒకే వేదికపై కనిపించారు.  డెమోక్రటిక్‌ పార్టీ మొత్తం ఐకమత్యంగా ఉందని చాటేలా ఈ ఇద్దరూ వేదిక పంచుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వాషింగ్టన్ శివార్లలోని మేరీల్యాండ్‌ కమ్యూనిటీ కాలేజ్‌ ఇందుకు వేదిక అయింది.

అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ వైదొలగిన నాటినుంచి ఆయన కమలా హారిస్‌ ప్రచారంలో కనిపించని విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరినీ ఒకే వేదికపై చూసిన అభిమానులు ‘థాంక్యూ జో’ అని నినాదాలు చేశారు. వచ్చేవారం చికాగోలో జరగనున్న పార్టీ కన్వెన్షన్‌లో అధికారికంగా హారిస్‌ను పార్టీ అభ్యర్థిగా ఎన్నిక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న వేళ బైడెన్‌ కూడా ప్రచార బృందంతో చేరడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈసందర్భంగా కమలా హారిస్‌ మాట్లాడుతూ ‘‘దేశాధ్యక్షుడిని ప్రేమించేవారు ఇక్కడ చాలామంది ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version