పాకిస్థాన్ ఎన్నికల బరిలో 26/11 దాడుల మాస్టర్ మైండ్ వారసుడు!

-

పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని అంతర్జాతీయ సమాజం భావిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని బహిరంగంగా ఖండిస్తున్న దాయాది దేశం ఉగ్రవాదులను కట్టడి చేశామని అంతర్జాతీయ సమాజానికి ఎన్నో మాటలు చెబుతోంది. కానీ చేతలు మాత్రం వేరేగా కనిపిస్తున్నాయి. ఎంతలా అంటే ఏకంగా అంతర్జాతీయ ఉగ్రవాది ఆ దేశ ఎన్నికల బరిలో దిగే అంత. సాక్షాత్తు ఉగ్రవాదే పోటీలో నిలుస్తున్నా ఆ దేశం మాత్రం టెర్రరిజానికి తమ దేశంలో చోటు లేదంటూ డొల్ల మాటలు చెబుతోంది.

అంతర్జాతీయ ఉగ్రవాది, 26/11 ముంబయి దాడుల మాస్టర్‌ మైండ్‌ హఫీజ్‌ సయీద్‌ స్థాపించిన పార్టీ ఇప్పుడు పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగింది. ‘ది పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌’ (పీఎంఎంఎల్‌) పేరిట సయీద్‌ ఓ పార్టీని ఏర్పాటు చేయగా 2018లో నిషేధానికి గురైంది. ఇక ఇప్పుడు ఆ పార్టీ మూలాల నుంచే తాజాగా పీఎంఎంఎల్‌ను ఏర్పాటు చేశారు. దీని గుర్తు కుర్చీ. ఈ పార్టీకి ఖలీద్‌ మసూద్‌ సింధూ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. తమ పార్టీ అన్ని నేషనల్‌, ప్రావిన్షియల్‌ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని అతడు ప్రకటించాడు. పైకి మాత్రం తమ పార్టీకి ఉగ్ర సంస్థ లష్కరేతో ఎటువంటి సంబంధం లేదని అతడు చెబుతున్నా ఆ పార్టీ తరఫున హఫీజ్‌ తనయుడు తల్హా సయీద్‌ ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతుండచంకో అవన్నీ మాటలేనని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version