రసాయనశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు

-

రసాయన శాస్త్రంలో ఈ సంవత్సరం ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. ‘ఇంజినీరింగ్​ టూల్స్​ ఫర్​ మాలుక్యూల్స్​ బిల్డింగ్స్​’ పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ అవార్డు వరించినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. కారోలిన్‌ బెర్టోజి, మార్టిన్‌ మెల్డల్‌, బారీ షార్ప్‌లెస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది.

‘పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్​’లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది. అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జెల్లింగర్​లను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది.

అవార్డు గ్రహీతల్లో.. అలైన్‌ ఆస్పెక్ట్‌ది ఫ్రాన్స్‌కాగా, జాన్‌ ఎఫ్‌.క్లాజర్‌ అమెరికాలో, ఆంటోన్‌ జైలింగర్‌ ఆస్ట్రేలియాలో భౌతిక శాస్త్ర పరిశోధకులుగా పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version