విమానంలో విరాళాలు అడిగిన పాకిస్థాన్ వాసి.. వీడియో వైరల్

-

సాధారణంగా ఎవరైనా రోడ్డుపైన విరాళాలు సేకరిస్తుంటారు. లేదా బస్సుల్లో.. రైళ్లలో విరాళాలు అడుగుతుంటారు. కానీ ఓ వ్యక్తి విమానంలో విరాళాలు సేకరించాడు. పాకిస్థాన్​కు చెందిన వ్యక్తి విమానంలో విరాళాలు సేకరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తి నిజంగా విరాళాల కోసం అలా చేశాడో.. లేక ఫేమస్ అవ్వడానికి చేశాడో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆ వీడియోలో ఏముందంటే.. విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా.. ఓ ప్రయాణికుడు లేచి .. ‘మేము మదర్సా కట్టడం కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బు ఇవ్వదలచుకుంటే నా వద్దకు వచ్చి ఇవ్వనవసరం లేదు. నేనే మీరు కూర్చున్న చోటుకు వస్తాను. నేనేమీ భిక్షాటన చేయడం లేదు. నాకు సాయం చేయండి’ అంటూ అభ్యర్థించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారు అనే విషయం తెలియలేదు. కానీ, రెండు వారాల క్రితం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. దీంతో అప్పటి నుంచి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version