భారత్‌పై, భారత విదేశాంగ మంత్రిపై రష్యా మరోసారి ప్రశంసలు కురిపించింది. భారత్ ఎప్పటికీ తమ చిరకాల మిత్రదేశమేనని పునరుద్ఘాటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు అంశంలో యూరోప్ నేతల నుంచి వచ్చిన విమర్శలను భారత్ తిప్పికొట్టిన తీరును గుర్తు చేస్తూ ప్రశంసలు గుప్పించింది. సోచిలో జరిగిన వరల్డ్ యూత్ ఫోరమ్‌లో పాల్గొన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ సమర్థతను ప్రశంసించారు.
యుద్ధ సమయంలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో తన స్నేహితుడు, భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ ప్రసంగిచిన సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఎందుకు ప్రారంభించారని పశ్చిమ దేశ నేతలంతా ప్రశ్నించాయని గుర్తు చేశారు. ఆ సమయంలో జైశంకర్ ‘మీ పని మీరు చూసుకోండి’ అంటూ అక్కడున్న వారికి సమాధానమిచ్చారని తెలిపారు. ఇక అప్పటి నుంచి పాశ్చాత దేశాలు సైతం రష్యా నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయని, ఇది జాతీయ గౌరవం అంటూ లావ్రోవ్ గుర్తు చేసుకున్నారు.