నూతన మిస్ అమెరికాగా సవన్నా గాంకివిచ్..!

-

కొత్త మిస్ అమెరికాగా సవన్నా గాంకివిచ్ ఎంపికయ్యారు. పాత మిస్ అమెరికా రిజైన్ చేయడంతో మిస్ యూనివర్స్ సంస్థ కొత్త మిస్ అమెరికాను నియమించింది. పాత మిస్ అమెరికాగా ఉన్న నొఇలియా ఓగిట్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఎంపికల సమయంలో రన్నరప్ గా నిలిచిన సవన్నా గాంకివిచ్ ను మిస్ అమెరికాగా ప్రకటించడం జరిగింది. 28 ఏళ్ల గాంకివిచ్ మిస్ అమెరికా 2023 కిరీటాన్ని సొంతం చేసుకుంది. హవాయ్ కు చెందిన ఈ భామ 2024 ఆగస్టు వరకు ఈ పదవిలో ఉండనుంది.

గాంకివిచ్ మావుయి ద్వీపంలో మహిళా సాధికారత కోసం ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ను కూడా నడుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా మిస్ అమెరికా 2023 పోటీల్లో పాల్గొన్న నొఇలియా ఓగిట్, సవన్నా గాంకివిచ్ లు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. మిస్ అమెరికాగా ఎంపిక అయిన ఓగిట్ రాజీనామా చేయడంతో ఆ అవకాశం సవన్నాను వరించింది. మిస్ అమెరికాతో పాటు మిస్ టీన్ అమెరికా కూడా రాజీనామా చేశారు. మిస్ టీన్ అమెరికాగా ఉన్న 17 ఏళ్ల ఉమా సోఫియా శ్రీవాత్సవ కూడా తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version