అమెరికాలో మళ్ళీ కాల్పుల గోల…!

-

ఆదివారం తెల్లవారుజామున వాషింగ్టన్ డి.సి.లో బహిరంగ పార్టీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 20 మంది గాయపడ్డారు, ఒక మహిళ ప్రాణాలతో పోరాడుతుంది అని అధికారులు పేర్కొన్నారు. ఒక మ్యూజికల్ పార్టీలో ఆహారం కోసం ప్రజలు వచ్చినప్పుడు ఈ కాల్పులు జరిగాయి అని అధికారులు పేర్కొన్నారు. 17 ఏళ్ళ  యువకుడు ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు అని అధికారులు వివరించారు.

ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడు అనేది స్పష్టత లేదు అని పేర్కొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని అధికారులు మీడియాకు తెలిపారు. ఒక్కరికి మాత్రమే ఆరోగ్యం విషమంగా ఉందని, మిగిలిన ఎవరికి ప్రాణ హాని లేదన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇది ఒక పుట్టిన రోజు పార్టీ అని అధికారులు మీడియాకు వివరించారు. కరోన ఆంక్షలు ఉన్నా సరే పార్టీకి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version