హమాస్​-ఇజ్రాయెల్​ యుద్ధానికి 4 రోజుల బ్రేక్.. కాల్పుల విమరణకు నెతన్యాహు కేబినెట్ ఆమోదం

-

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో సామాన్య పౌరులు మరణిస్తున్నారని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హమాస్-ఇజ్రాయెల్​ల మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపిస్తోంది. గాజాపై పోరుకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచ్చేందుకు సిద్ధమైంది.

తాజాగా హమాస్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం 4 రోజులు మాత్రమే అమల్లో ఉంటుందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం తమ వద్ద ఉన్న 240 మంది బందీల్లో 50 మందిని హమాస్ విడుదల చేస్తుందని ప్రకటించారు. విడుదలైన ప్రతి 10 మంది బందీలకు ఒక రోజు ఒప్పందాన్ని పొడిగిస్తామని తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత సమావేశమైన ఇజ్రాయెల్‌ కేబినెట్‌ సుధీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ సంధి ఒప్పందానికి బుధవారం ఉదయం అంగీకారం తెలిపింది. కానీ.. ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version