ఓటీటీలోకి ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

సంపూర్ణేశ్‌ బాబు.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. కంటెంట్​ లేకపోయినా తన కామెడీ టైమింగ్​తో నవ్వించగలిగే నటుడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. పొలిటికల్ సెటైరికల్​ జోనర్​లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా సత్తా చాటలేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్​కు రెడీ అవుతోంది.

ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీలివ్‌’ లో ఈ సినిమా ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఆ సంస్థ తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఆడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. కోలీవుడ్​లో ఘన విజయం అందుకున్న ‘మండేలా’ కు రీమేక్‌గా రూపొందిందీ చిత్రం. ఇక్కడ నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేసి దర్శకురాలు పూజ కొల్లూరు ఈ సినిమాను రూపొందించారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఓటు విలువ చాటి చెప్పిన ఈ సినిమా ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేళ ఓటీటీలో సందడి చేయనుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version