ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఆ దేశంలో పర్యటించి ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఇక తాజాగా హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఇసాక్ హెర్జాగ్‌తో రిషి సునాక్ సమావేశం కానున్నారు. హమాస్ దాడులు.. గాజాపై ఇజ్రాయెల్ దాడుల వంటి పలు విషయాలపై వారితో చర్చించనున్నట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈనెల 7న హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్, గాజాలో చనిపోయినవారికి సంతాపం తెలపనున్నట్లు పేర్కొంది.
ప్రతి పౌరుని మరణం విషాదమే. హమాస్ ఉగ్రదాడుల తర్వాత అనేక మంది మృతి చెందారు. సాధ్యమైనంత త్వరగా గాజాలో మానవతా సాయం అందించటానికి మార్గం తెరవాలి. అక్కడ చిక్కుకున్న బ్రిటన్ పౌరులు బయటపడటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్రిటన్ ప్రధాని సునాక్.. ఇజ్రాయెల్‌ను కోరనున్నాం. అని ఇజ్రాయెల్‌కు బయలుదేరే ముందు విడుదల చేసిన ఓ ప్రకటనలో రిషి సునాక్ పేర్కొన్నారు.