రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తాయని ఇటీవలే జీ7 దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా ఉక్రెయిన్‌కు కొన్ని ఆయుధాలు పంపినట్లు తెలిసింది. యుద్ధ భూమిలో అతి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరాయట. ఈ విషయాన్ని పెంటగాన్ ధ్రువీకరించింది. రష్యా దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా ఈ ఆయుధాలను కీవ్‌కు సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించిన సంగతి తెలిసిందే.
క్లస్టర్ ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి.. వాటిలోపల ఉన్న చిన్న బాంబులు ఆ ప్రాంతం మొత్తం వెదజల్లుతాయి. వీటిల్లో కొన్నిపేలని వాటి శాతాన్ని డడ్‌రేట్‌గా పేర్కొంటారు. ఇవి అలానే ఉండిపోయి.. యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో జనసంచారం పెరిగిన సమయంలో పేలి ప్రమాదాలకు కారణం అవుతాయి. తాజాగా అమెరికా సరఫరా చేసే క్లస్టర్ ఆయుధాల్లో డడ్‌రేట్‌ను గణనీయంగా తగ్గించామని అమెరికా చెబుతోంది. వేల సంఖ్యలో తాము వీటిని ఉక్రెయిన్‌కు ఇస్తామని పెంటగాన్ చెబుతున్నా.. కచ్చితమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.