పుతిన్తో ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించాలి.. మోదీ రష్యా పర్యటనపై అమెరికా

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయన సోమవారం అక్కడ చేరుకున్నారు. సోమవారం రాత్రి రష్యా అధ్యక్షుడు మోదీకి విందు ఆతిథ్యమిచ్చారు. ఈ నేపథ్యంలో మోదీ రష్యా పర్యటనపై అమెరికా స్పందించింది. భారత్‌ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని అగ్రరాజ్యం తెలిపింది. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించింది.

రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను భారత్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని అమెరికా తెలిపింది. పుతిన్‌తో చర్చల్లో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోదీకి అమెరికా సూచించింది. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్‌ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్‌కు స్పష్టం చేయాలని కోరింది. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతామని అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు. మోదీ రష్యా పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version