చైనాలో రష్యా విదేశాంగ మంత్రి పర్యటన వేళ.. డ్రాగన్ దేశానికి అమెరికా వార్నింగ్

-

ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంలో చైనా జోక్యంపై అమెరికా తీవ్రంగా స్పందిస్తోంది. ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో రష్యా ముందడుగు వేస్తే.. అందుకు చైనానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ బీజింగ్‌లో పర్యటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

ఉక్రెయిన్‌లో రష్యా ముందడుగు.. ఐరోపాలో శక్తి సమతుల్యతను దెబ్బతీసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని ఇప్పటికే చైనాకు స్పష్టం చేశామని, ఇదే కొనసాగితే.. అమెరికా-చైనా సంబంధాలపై దీని ప్రభావం పడుతుందని హెచ్చరించింది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి పర్యటన సందర్భంగా రష్యాలో సామాజిక భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు తమ మద్దతు ఉంటుందని చైనా హామీ ఇచ్చింది. మరోపక్క ఉక్రెయిన్‌కు మరింత ఆయుధ సాయాన్ని ఆమోదించడంపై యూఎస్‌ కాంగ్రెస్‌లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా.. అదే సమయంలో రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. ఈ క్రమంలో చైనా మద్దతు గురించి ఎదురైన ప్రశ్నకు యూఎస్‌ విదేశాంగ సహాయ మంత్రి కర్ట్‌ క్యాంప్‌బెల్ తాజా వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version