అమెరికా విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తమ అవసరాలు తీర్చుకోవడం ఆ తరువాత పక్కన పెట్టేయడం… ఆంక్షలు విధించడం అగ్రరాజ్యానికి అలవాటే అని తీవ్రస్థాయితో ధ్వజం ఎత్తాడు. తమ మిత్ర దేశం చైనా తమకు అండగా నిలుస్తోందని.. చైనా తమను ఆదుకుంటోందని ఆయన అన్నారు. చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడాన్ యూనివర్సిటీ సలహా కమిటీ డైరెక్టర్ ఎరిస్ లీకి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమయంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గతంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉండేవని.. అవసరం వచ్చినప్పుడు తమ దేశాన్ని వాడుకోవడం.. ఆ తరువాత పట్టించుకోకపోవడం అమెరికాకు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. గతంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉండేవని.. 1980ల్లో పాక్ -యూఎస్ సంబంధాలను ఇమ్రాన్ ప్రస్తావించాడు. అప్పట్లో సోవియట్ యూనియన్ సైనిక దళాలు ఆఫ్గనిస్తాన్ లో వచ్చిన తర్వాత.. తమతో దగ్గరైందని.. ఆతరువాత సోవియట్ యూనియన్ దళాలు వెళ్లిపోయిన తర్వాత తమపై ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తుచేస్తుకున్నారు. గత ఏడాది చోటు చేసుకున్న ఆఫ్గాన్ పరిణామాల తర్వాత తమదేశాన్ని అమెరికా నిందిస్తోందని విమర్శించారు.