BREAKING : వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ దుర్మరణం

-

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇటీవల తిరుగుబావుటా ఎగురవేసిన ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ దుర్మరణం చెందారు. ప్రిగోజిన్‌ ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్‌ కుప్పకూలడంతో ఆయన చనిపోయారు. రష్యాలోని మాస్కోలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రిగోజిన్‌ సహా 10 మంది మృతి చెందినట్లు.. రష్యా అత్యవసర విభాగం వర్గాలు తెలిపాయి. తెవర్‌ రీజియన్‌లో ప్రయాణికులతో కూడిన జెట్‌ కూలినట్లు.. సమాచారం అందినట్లు వెల్లడించాయి.

ఆ విమాన ప్రయాణికుల జాబితాలో.. ప్రిగోజిన్‌ కూడా ఉన్నట్లు రష్యా ఏవియేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది. మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌ బర్గ్‌కు వెళ్తున్న ప్రైవేటు జెట్‌ కూలిందని.. మృతి చెందిన వారిలో ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారని.. తెలిపింది. కుప్పకూలిన జెట్‌ ప్రిగోజిన్ పేరున ఉన్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌పై..సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్‌.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఆయన ప్రభుత్వంపై.. ఎదురుతిరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వెనుదిరిగిన ప్రిగోజిన్ అప్పటి నుంచి లో ప్రొఫైల్​లో ఉన్నారు. అయితే పుతిన్.. అంత ఈజీగా ప్రిగోజిన్​ను వదలిపెట్టరని ఇప్పటికే పలు నిఘా వర్గాలు వెల్లడించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version