ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించిన వార్తలు ఎంత వైరల్ అవుతాయో అందరికీ తెలుసు. కిమ్ తీసుకునే నిర్ణయాలు అలా ఉండడమే దానికి కారణం. తాజాగా కిమ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి ఎంత మేర నష్టం కలగజేసిందో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ రూపంలో కరోనా వైరస్, తన కోరల్ని చూపింది. ఈ నేపథ్యంలో కరోనా నుండి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మేలని అందరూ అనుకుంటున్నారు.
ఐతే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మాత్రం తమకు వ్యాక్సిన్ అవసరం లేదు అంటున్నాడు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అవసరం లేదు. సహజ పద్దతుల ద్వారానే కరోనాను ఎదుర్కొంటామని కిమ్ తెలిపారు. ఈ మేరకు 30లక్షల కోవిడ్ డోసులను తిరస్కరించారు. తమ స్టైల్ లో కరోనాను ఎదుర్కొంటామని, ఇతర దేశాల వ్యాక్సిన్లు అవసరం లేదని కిమ్ మాట్లాడాడు.