ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే

-

ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితులు.. జీవన ప్రమాణాలు అత్యంత దుర్భరంగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్త స్టీవ్‌ హాంకే ‘వార్షిక దయనీయ సూచీ’ ప్రకారం.. అక్కడి ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్‌, సిరియా, సూడాన్‌ దేశాల కంటే ఇక్కడి పరిస్థితులు దయనీయంగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ దేశం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన 157 దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది.

‘అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అత్యధిక వడ్డీ రేట్లు, బలహీనమైన జీడీపీ వృద్ధి.. ఇలా అన్నీ కలిపి జింబాబ్వేని ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశాల జాబితాలో నిలిపాయి. ఈ జాబితాలో వెనెజువెలా, సిరియా, లెబనాన్‌, సూడాన్‌, అర్జెంటీనా, యెమెన్‌, ఉక్రెయిన్‌, క్యూబా, తుర్కియే, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు తొలి 15 స్థానాల్లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version