ఐఫోన్ 11 సిరీస్ ఫోన్ల ధరలివే.. భారత్‌లో సెప్టెంబర్ 27న విడుదల…

-

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన నూతన ఐఫోన్లు.. ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్‌లను నిన్న జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్లు భారత్‌లో సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుండగా.. అదే రోజు నుంచి వీటిని విక్రయించనున్నారు.

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన నూతన ఐఫోన్లు.. ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్‌లను నిన్న జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. అదిరిపోయే స్పెసిఫికేషన్లను ఈ ఫోన్లలో అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్లు భారత్‌లో సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుండగా.. అదే రోజు నుంచి వీటిని విక్రయించనున్నారు. ఇక ఈ ఫోన్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ఐఫోన్ 11 64జీబీ – రూ.64,900
ఐఫోన్ 11 128జీబీ – రూ.69,900
ఐఫోన్ 11 256జీబీ – రూ.79,900

ఐఫోన్ 11ప్రొ 64జీబీ – రూ.99,900
ఐఫోన్ 11ప్రొ 256జీబీ – రూ.1,13,900
ఐఫోన్ 11ప్రొ 512జీబీ – రూ.1,31,900

ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 64జీబీ – రూ.1,09,900
ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 256జీబీ – రూ.1,23,900
ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 512జీబీ – రూ.1,41,900

ఐఫోన్ 11 సిరీస్ ఫోన్ల‌ను భార‌త్‌లో ఆపిల్ ఆథ‌రైజ్డ్ రీసెల్ల‌ర్ల‌తోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ స్టోర్లు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్స్ లో విక్ర‌యించ‌నున్నారు. మొత్తం 150కి పైగా దేశాల్లో ఒకేసారి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version