టాప్‌ ప్లేస్‌ పై కన్నేసిన ఢిల్లీ..రాజస్థాన్ తో కీ ఫైట్…!

-

ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో జట్ల స్థానాలు ఒక్క మ్యాచ్‌తోనే తలకిందులు అవుతున్నాయి. ఏ మ్యాచ్‌ ఓడినా పాయింట్స్‌ టేబుల్‌లోకి కిందకు రావడం ఖాయం. దీంతో ఇక నుంచి ప్రతి టీమ్‌కి ప్రతి మ్యాచ్‌ కీలకమే. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఢిల్లీతో.. తడబడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనుంది.

ఐపీఎల్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ పోరు కాసేపట్లో జరగనుంది. లీగ్‌లోనే సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తలపడనుంది. రెండు జట్లు కూడా బలంగానే కన్పిస్తున్నప్పటికీ.. ఆట తీరులో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌ చాలా మెరుగ్గా ఉంది. పాయింట్స్‌ టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌ మ్యాచ్‌లో ఢిల్లీదే పై చేయి.

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రాజస్థాన్ రాయల్స్ కంటే చాలా మెరుగ్గా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఢిల్లీ జట్టు మంచి ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఢిల్లీ పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌కు రావడం ఖాయం. ఢిల్లీ బ్యాటింగ్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పృథ్వీషా, శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌, స్టొయినిస్‌లతో బ్యాటింగ్‌ భీకరంగా ఉంది. సౌతాఫ్రికా స్పీడ్‌ స్టార్‌ కగిసో రబడా ఢిల్లీ బౌలింగ్‌ ఎటాక్‌కు లీడర్‌. ఈ ఐపీఎల్‌లోనే రబడా టాప్‌ బౌలర్‌. ఏడు మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు తీసి బౌలర్ల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

ఏడు మ్యాచులు ఆడిన రాజస్థాన్.. కేవలం మూడింటిలోనే విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో స్టీవ్ స్మిత్, సంజూ శామ్సన్ బాగా ఆడారు. ఆ తర్వాత జోస్‌ బట్లర్ కూడా ఇప్పుడు తన ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. అయితే, మిగతా ఆటగాళ్లు మాత్రం అంతగా రాణించడం లేదు. రాజస్థాన్‌ మిడిలార్డర్‌ చాలా వీక్‌గా ఉంది. మిడిలార్డర్‌ వైఫల్యం వల్లే రాజస్ధాన్‌ తడబడుతోంది. రాజస్థాన్‌ బౌలింగ్‌లో కీ ప్లేయర్‌ జోఫ్రా ఆర్చర్‌. ఈ స్పీడ్‌ స్టార్‌ 145 కి.మీ వేగం తగ్గకుండా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తిస్తున్నాడు. అయితే జోఫ్రాతో పాటు రాణించే బౌలరే కరువయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version