అన్ లాక్ 5.0: ఆ సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతున్నాయ్…

-

కరోనా కారణంగా ఆరు నెలలకి పైగా థియేటర్లు ముతబడి ఉన్నాయి. ఐతే అన్ లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15వ తేదీ నుండి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీసు వద్ద సందడి చేయబోయే సినిమాల లిస్టు వచ్చేసింది. బాలీవుడ్ సినిమాలైన తానాజీ, కేదార్ నాథ్, థప్పడ్, మలంగ్ , శుభ్ మంగల్ జ్యాదా సావ్ దాన్ మొదలగు చిత్రాలు థియేటర్ల వద్ద మళ్ళీ సందడి చేయబోతున్నాయి. అలాగే మరికొన్ని ఓటీటీలో రిలీజైన చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం.

కాకపోతే మల్టీప్లెక్స్ కంపెనీలు ఈ సినిమాలన్ని థియేటర్లో విడుదల చేయడానికి ఒప్పుకోవట్లేదట. ఏదైతేనేం మొత్తానికి థియేటర్ల వద్ద మళ్లీ సందడి నెలకొననుంది. ఐతే తెలంగాణలో థియేటర్ల విషయమై ఎలాంటి సమాచారం రాలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయం ఇంకా బయటకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరికొన్ని రోజులు థియేటర్లు మూసి ఉంచుతారట. ఈ మేరకు థియేటర్ల ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయం తీసుకుందట. లాక్డౌన్ సమయం నుండి థియేటర్ల మెయింటెనెన్స్ కోసం వచ్చిన కరెంటు బిల్లులకి ప్రభుత్వం సాయం చేస్తే మళ్ళీ థియేటర్లు ఓపెన్ అవుతాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version