ఈ రోజు కాసేపటి క్రితమే ముగిసిన ఢిల్లీ మరియు చెన్నై మ్యాచ్ లో ధోనీ సేన ఏకంగా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి ఆ ధోనీ సేన నిర్ణీత ఓవర్ లలో 167 పరుగులు చేయగా, లక్ష్య చేదనలో ఢిల్లీ కేవలం 140 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ఢిల్లీ ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయింది. ఓపెనర్ ల దగ్గర నుండి కీ ప్లేయర్స్ అందరూ విఫలం కావడంతో ఓటమి చెందారు. ఒక దశలో మనీష్ పాండే మరియు రాసో లు భాగస్వామ్యాన్ని నమోదు చేస్తుంటే… పతిరణ అద్భుతమైన బంతితో పాండే ను ఔట్ చేసి ఢిల్లీ గేట్లు తెరిచాడు. ఆ తర్వాత ఏ దశలోనూ లక్ష్యం వైపు వెళ్లేలా కనిపించలేదు.
ఐపిఎల్ 2023: ఢిల్లీ దారుణ ఓటమి… !
-