గత రాత్రి ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ను గుజరాత్ టైటాన్స్ 9 వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో మొదటి స్థాన్నాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంజు శాంసన్ టీం ను స్పిన్నర్ల ద్వయం రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లు దారుణంగా దెబ్బ తీశారు. తమదైన లైన్ అండ్ లెన్త్ , గూగ్లీ మరియు రాంగ్ అన్ లతో రాజస్థాన్ ను ముప్పతిప్పలు పెట్టారు. వీరిద్దరూ ఈ మ్యాచ్ లో 7 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసుకున్నారు. ఈ వికెట్లలో పడిక్కల్, అశ్విన్, రియాన్ పరాగ్, హెట్ మెయిర్ మరియు ధృవ్ జురెల్ ఉన్నారు. ఈ మ్యాచ్ లో వీరిదే పైచేయి అని చెప్పాలి…
ఐపీఎల్ 2023: రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ & షమీలే గుజరాత్ బలం !
-