నేటి మ్యాచ్ లో హైలైట్ ఏమైనా ఉంది అంటే అది యువ సంచలనం యశస్వి జైస్వాల్ అని చెప్పాలి. కోల్కతా నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్ ను చేధించడానికి వచ్చిన రాజస్థాన్.. మొదటి బంతి నుండి దండయాత్ర మొదలు పెట్టింది. ముఖ్యంగా జైస్వాల్ ఫోర్లు మరియు సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఇతను కేవలం 13 బంతుల్లో అర్థ సెంచరీ సాధించి ఐపిఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు. జైస్వాల్ దెబ్బకు బంతి ఎక్కడ వేయాలో కోల్కతా బౌలర్లకు అర్దం కాలేదు అని చెప్పాలి. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా పరుగుల పండుగ చేసుకున్నాడు జైస్వాల్. ఇతని బ్యాటింగ్ తీరు చూస్తుంటే ఒకప్పుడు ఐపిఎల్ లో క్రిస్ గేల్ ను గుర్తుకు తెచ్చాడు. గేల్ కూడా ఇంతే బౌండరీలు వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఐపిఎల్ లో జూనియర్ గేల్ లాగా ఇతని ఇన్నింగ్స్ సాగింది.
ఐపిఎల్ 2023: క్రిస్ గేల్ తరహా విజృంభణ… ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించిన యశస్వి జైస్వాల్ !
-