ఐపీఎల్ 2023 : ఫిలిప్ సాల్ట్ “డక్ అవుట్”… ఇండియా పిచ్ పై మీరు సరిపోరు !

-

ఐపీఎల్ లో భాగంగా అహ్మదాబాద్ లో ఈ రోజు జరుగుతున్న ఢిల్లీ మరియు గుజరాత్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వార్నర్ టీం కు మొదటి బంతికే చుక్కలు కనిపించాయి. ఓపెనర్లుగా వచ్చిన వార్నర్ మరియు ఫిలిప్ సాల్ట్ లలో సాల్ట్ స్ట్రైకింగ్ తీసుకున్నాడు. మొదటి ఓవర్ ను వేసిన మహమ్మద్ షమీ… వేసిన తొలి బంతికే సాల్ట్ ను మిల్లర్ క్యాచ్ తో డక్ అవుట్ చేశాడు. దీనితో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ కి సరైన ఆరంభం దక్కకపోగా మొదటి బంతికే వికెట్ ను కోల్పోయింది. మాములుగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మన్ అయిన ఫిలిప్ సాల్ట్ సొంత గ్రౌండ్ లలో మరియు పి ఎస్ ఎల్ లో కూడా అద్భుతంగా ఆడుతూ ప్రత్యర్థులకు వణుకుపుట్టించాడు.

కానీ ఇండియా పిచ్ లపై ఎందుకో తన బ్యాట్ బౌలర్లకు లొంగిపోతోంది. మరి ఢిల్లీ గుజరాత్ ముందు ఎన్ని పరుగులను లక్ష్యంగా వుంచుతోందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version