నేడు ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ ల మధ్యన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం జరగబోయే ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. కాగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో జరిగిన ప్రదర్శనను బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నది ముంబై కే అని చెప్పాలి. ముంబై తో పోల్చుకుంటే గుజరాత్ కు బ్యాటింగ్ లో డెప్త్ చాలా తక్కువ అని చెప్పాలి. ఓపెనర్లు కనుక ఫెయిల్ అయితే గుజరాత్ దారుణంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో శుబ్ మాన్ గిల్ ఒక్కడే జట్టుకు విజయాలను అందిస్తూ వస్తున్నాడు.
ఐపీఎల్ 2023:క్వాలిఫైయర్ 2 … రెండు జట్ల బలాబలాలివే …!
-