పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఓ జి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదని చెప్పాలి. ఇకపోతే షూటింగ్ అప్డేట్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి విషయంపై కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు కిక్కిచ్చే వార్తలను మేకర్స్ రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరొక వార్త బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అయితే అతని ఫేస్ చేయబోయే విలన్ ఏ రేంజ్ లో ఉండాలి మరి.
అందుకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చూసిన ఒక బెంచ్ మార్క్ క్యారెక్టర్ లా ఉండాలి అని అందుకే ఈ క్యారెక్టర్ కోసం సుజిత్ ఒక బాలీవుడ్ హీరోని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్ల ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరోలైన టైగర్ ష్రాప్, రణవీర్ సింగ్ , ఆయుష్మాన్ ఖురానా వంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు హీరోలు కూడా ఇప్పుడు బాలీవుడ్లో సోలో హీరోలుగా మంచి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ స్టార్ స్టేటస్ కూడా లభించింది.
ఇకపోతే టైగర్ ష్రాఫ్ చేసే సినిమాలు అసలు ఇండియాలోనే ఎవరు చేసే అవకాశం లేదు. ఇక మిగిలింది ఆయుష్మాన్ ఖురానా.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కెరియర్ను నిర్మించుకున్నాయని ఇప్పుడు సోలో హీరోగా సొంత మార్కెట్ క్రియేట్ చేసుకునే స్థాయికి ఎదిగాడు. కాబట్టి ఈ ముగ్గురిలో వీరు ఎవరో ఒకరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.