ఐపీఎల్ లో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జాయింట్స్ లాంటి రెండు బలమైన జట్ల మధ్య పోటీ అని చెప్పాలి. ఈ రెండు జట్లు కూడా గత ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. కానీ రజస్త రాయల్స్ మాత్రమే ఫైనల్ కు చేరుకోగా , లక్నో ఎలిమినేటర్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇక ఈ సీజన్ లో టైటిల్ కొట్టగల సత్తా ఉన్న జట్లలో ఈ రెండు ఉన్నాయి. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం లో ఈ రెండు జట్లు కాసేపటి తర్వాత తలపడనున్నాయి. అందులో భాగంగా టాస్ నెగ్గిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.