IPL 2024 : అరుదైన క్లబ్‌లో బుమ్రా

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 20 వ మ్యాచ్ ముంబైలోని వాంఖాడే స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన క్లబ్‌లో చేరాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ పోరెల్‌ (41) వికెట్‌ పడగొట్టడంతో ఐపీఎల్‌లో 150 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం పది మంది (బుమ్రాతో సహా) మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు . ఈ జాబితాలో చహల్‌ 195 వికెట్లతో టాప్‌లో ఉండగా.. విండీస్ చిచ్చర పిడుగు బ్రావో (183), పియుశ్‌ చావ్లా (181), అమిత్‌ మిశ్రా (173), రవిచంద్రన్ అశ్విన్‌ (172), భువనేశ్వర్‌ కుమార్‌ (171), శ్రీలంక ఆటగాడు లసిత్‌ మలింగ (170), వెస్టిండీస్ ప్లేయర్ సునీల్‌ నరైన్‌ (166), జడేజా (153) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.

 

కాగా, ఈ మ్యాచ్ లో ఇషాన్ కిష‌న్‌(44),రోహిత్ శ‌ర్మ‌(49) మొదటి వికెట్ కి 80 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్(45 నాటౌట్‌), రొమారియో షెప‌ర్డ్‌(39 నాటౌట్‌)లు చివ‌ర్లో వీరవిహారం చేశారు. దాంతో ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 234 పరుగులు చేసింది. ఇక లక్ష్యం చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version