IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

 

అయితే ఇందులో గుజరాత్ టైటాన్స్ జట్టు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే గుజరాత్ టైటాన్స్ కు నరేంద్ర మోడీ స్టేడియం హోమ్ గ్రౌండ్. గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్లలో మూడింట గెలిచి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్లలో రెండు మ్యాచ్లలో గెలిచి పాయింట్ పట్టికలో 9వ స్థానంలో ఉంది.

ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్ :పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్, స్టబ్స్, హోప్, పంత్, అక్షర్, సుమిత్, కుల్దీప్, ఇషాంత్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్

గుజరాత్ ప్లేయింగ్ ఎలెవన్ : గిల్, సాహా, సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version