సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి మరో రికార్డు సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 2011(557 పరుగులు), 2013(634పరుగులు), 2015(505 పరుగులు), 2016(973 పరుగులు), 2018(530 పరుగులు), 2019(464 పరుగులు), 2020(466 పరుగులు), 2021(405 పరుగులు), 2023(639 పరుగులు) సీజన్లతో పాటు 2024లోనూ ఈ ఫీట్ సాధించారు. ఓపెనర్ గానూ 4000 పరుగుల మైలురాయి అందుకున్నారు.
కాగా, ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ తొలి వికెట్ కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ డూప్లెసిస్ 12 బంతుల్లో 24 పరుగులు చేయగా, కింగ్ విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. పటిధర్ మాత్రం ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లో 5 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 15.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 153 చేసింది.