ఐపీఎల్ లో కరోనా కల్లోలం మొదలైంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు సంబంధించిన ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీ టీంకు చెందిన మరో క్రికెటర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో జట్టులో ఇప్పటి వరకు నలుగురు సిబ్బంది, ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకింది. ఢిల్లీ క్యాపిటల్ టీంకు సంబంధించి ఆటగాళ్లు టిమ్ సీఫెర్ట్, మిచెల్ మార్ష్ కరోనా బారిన పడ్డారు. ఇలా వరసగా ఢిల్లీ ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఆ జట్టులో గందరగోళం నెలకొంది.
ఇదిలా ఉంటే కరోనా భయంలో ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ జట్టుకు దూరం అయ్యారు. రికీ పాంటింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలడంతో అతను జట్టుకు దూరంగా ఉండనున్నారు. ఈరోజు (శుక్రవారం ) రాత్రి రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్ కు రికీపాంటింగ్ అందుబాటులో ఉండటం లేదు. అయితే రికీ పాంటింగ్ కు ఇప్పటి వరకు రెండు సార్లు కరోనా టెస్టులు జరిగినా… నెగిటివ్ వచ్చింది. అయినా జట్టు ప్రయోజనాల దృష్ట్యా, మేనేజ్‌మెంట్ మరియు వైద్య బృందం పాంటింగ్ ఐదు రోజులు ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించింది ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం.