ఐపీఎల్ సీజన్లో జరుగుతున్న మూడవ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. కోల్ కతా నైట్ రైడర్స్ పెట్టిన 188పరుగుల లక్ష్య ఛేధనలో వెనకబడింది. మొత్తం 20ఓవర్లు ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 177పరుగులు చేసి 10పరుగుల తేడాతో ఓడిపోయింది. బైర్ స్ట్రో, మనీష్ పాండే హాఫ్ సెంచరీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్లుగా దిగిన వార్నర్, వృద్ధిమాన్ సాహా ఒకరి వెనక ఒకరు వెనుదిరగగా బైర్ స్ట్రో, మనీష్ పాండే కలిసి హైదరాబాద్ కి చక్కని భాగస్వామ్యాన్ని అందించారు.
102పరుగుల వద్దల బైర్ స్ట్రో ఔట్ అవడంతో వారి భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ నబీ, 14పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మొత్తానికి ఆట పూర్తయ్యే సమయానికి 20ఓవర్లు ఆడిన సన్ రైజర్స్ జట్టు వికెట్లు కోల్పోయి 177 పరుగులు మాత్రమే చేసి, ఈ సీజలో మొదటి ఓటమిని చవి చూసింది. స్కోరు బోర్డ్ విషయానికి వస్తే, బైర్ స్ట్రో 55పరుగులు (40బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు), మనీష్ పాండే 61పరుగులు( 44బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు), అబ్దుల్ సమద్ 19పరుగులు( 8బంతుల్లో 2సిక్సర్లు) చేసాడు. కోల్ కతా బౌలర్లలో ప్రసీద క్రిష్ణ 2వికెట్లు తీసుకోగా, షకిబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, ఆండ్రూ రస్సెల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.