స్వైన్ ఫ్లూ తో ఐపీఎస్ అధికారి కన్నుమూత

-

హైదరాబాద్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారి డాక్టర్ మధుకర్ శెట్టి స్వైన్‌ ఫ్లూ బారిన పడి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా…హెచ్1ఎన్1 వైరస్ స్వైన్ ఫ్లూ వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఐసీయూలో విభాగంలో ప్రత్యేకంగా చికిత్స అందించిన ఆయన  పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

కర్ణాటకలోని తీర ప్రాంత పట్టణమైన కుందపుర మధుకర్ స్వస్థలం. 1999 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఉన్నత స్థాయి అధికారికి స్వైన్ ఫ్లూ సోకడంతో అటు అకాడమీలోనూ, ఇటు ప్రభుత్వంలో పూర్తి స్థాయి అలెర్ట్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version