బంగ్లాకు షాక్‌.. ఐర్లాండ్‌ విజయం

-

ఐర్లాండ్ జట్టు, ఆతిథ్య జట్టు అయిన బంగ్లాదేశ్‌ టీం పై చివరి టీ20ల్లో విరుచుకు పడింది . ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న బాంగ్లాదేశ్ జట్టుకు క్లీన్‌స్వీప్ చేసే అవకాశం దక్కకుండా చేసింది ఐర్లాండ్. నేడు జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది ఐర్లాండ్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు‌ను ఐర్లాండ్ బౌలర్లు 19.2 ఓవర్లలోనే అల్ అవుట్ చేశారు. 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను షమీమ్ హొస్సేన్(51) ఆదుకోవడంతో ఆ జట్టు కనీసం 124 పరుగులు అయినా చేయగలిగింది.

ఛేదనలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(77) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో స్వల్ప లక్ష్యాన్ని 14 ఓవర్లలోనే ఛేదించింది ఐర్లాండ్. ఓపెనర్ రాస్ అడైర్(7), లోర్కాన్ టక్కర్(4) నిరాశపర్చినప్పటికీ.. పాల్ స్టిర్లింగ్ ఊచకోతతో ఐర్లాండ్ గెలుపు దిశగా దూసుకెళ్లింది. పాల్ స్టిర్లింగ్ అవుటైనప్పటికీ.. హ్యారీ టెక్టెర్(14 నాటౌట్), కర్టిస్ కాంఫర్(16 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని అందించారు. బంగ్లాదేశ్ గడ్డపై బంగ్లాను ఓడించడం ఐర్లాండ్‌కు ఇదే మొదటిసారి. ఐర్లాండ్ మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో ఓడిపోయింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version