బిగ్ బ్రేకింగ్ : ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ మార్పు….??

-

ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్, సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేసాయి అనే చెప్పాలి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని, యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీగా, అలానే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయాలని భావించారు నిర్మాతలు. ఇక సరిగ్గా అదే సమయంలో, ఒక్క రోజు ముందుగా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా వస్తుండడంతో, అంతకంటే ముందే రిలీజ్ చేస్తే తమ సినిమాకు ఓపెనింగ్స్ మరింతగా రావడంతో పాటు, పండగ సమయంలోమరింతగా కలెక్షన్స్ సంపాదించే అవకాశం ఉందని అల సినిమా యూనిట్ భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.

అదీకాక రెండు రోజుల క్రితం ఈ సినిమా పూర్తి ప్రింట్ ని చూసి ఎంతో థ్రిల్ అయిన సినిమా యూనిట్, రిలీజ్ డేట్ కంటే ముందే వస్తే, సినిమా మరింతగా రాబట్టగలదని యోచిస్తున్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అలవైకుంఠపురములో యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సినిమా తేదీ మార్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కాగా అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, జయరాం, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version