“బిగ్ బాస్” చేస్తోంది సబబేనా…ఎలిమినేషన్ విషయంలో తప్పిదాలు?

-

బిగ్ బాస్ సీజన్ 7 లో భాగంగా గత వారం నుండి ఉల్టా పల్టా అంటూ ఇష్టం వచ్చినట్లు నిర్వాహకులు అందిస్తున్నారని బయట నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నయని పావని విషయంలో బిగ్ బాస్ పొరపాటు చేశాడు అంటూ గొంతు వినిపిస్తోంది. పావని అండ్ బ్యాచ్ వచ్చిన ఒక వారంలో వాస్తవంగా చెప్పాలంటే అందరికన్నా చాలా యాక్టీవ్ గా ,మరియు అందరితో కలివిడిగా ఉంటూ, ఆడేందుకు అవకాశం వచ్చిన రెండు టాస్క్ లలో శక్తిమేర ప్రయత్నించింది నయని పావని. కానీ ఎందుకో ఆమెను జనాలు ఎలిమినేట్ చేసినట్లుగా చెప్పి ఇంటి నుండి పంపించేశారు. కానీ గత వారం బిగ్ బాస్ లీక్ లలో శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని తప్పుడు సమాచారాన్ని బయటకు పంపించారు.

కానీ శోభను సేవ్ చేశారు.. ఇక ఆఖరిలో మిగిలిన పావని మరియు అశ్విని లలో ఎవరిని అడిగినా ఖచ్చితంగా అశ్విని ఎలిమినేట్ అవ్వాలని చెబుతారు..కానీ ఈ ఉల్టా పల్టా కాబట్టి పావనిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version