గుడివాడలో బాబు జోరు..కొడాలికి ఎఫెక్ట్ అవుతుందా?

-

చాలా రోజుల తర్వాత గుడివాడలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఉమ్మడి కృష్ణాలో పర్యటిస్తున్న బాబు..మొదట బందరులో పర్యటించారు. అక్కడ పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. రాత్రి 12 గంటల వరకు సభ నడిచింది. ఇక గుడివాడలో కూడా అంతే పరిస్తితి. గుడివాడ రోడ్ షోనే దాదాపు 5 గంటల పాటు జరిగింది.

బాబు పర్యటనలో అడుగడుగున రోడ్లపై ప్రజలు కనిపించారు. ఇక రాత్రి 11 గంటలకు సభ మొదలైంది..1 గంట వరకు సాగింది..అప్పటికి జనం నిలబడ్డారు. దీని బట్టి చూస్తే గుడివాడలో తెలుగు తమ్ముళ్ళు ఎంత కసితో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. టి‌డి‌పి నుంచి రెండుసార్లు గెలిచి, అదే టి‌డి‌పి ద్వారా రాజకీయంగా ఎదిగి..ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి రెండుసార్లు గెలిచి..బాబుని బూతులు తిడుతున్న కొడాలి నానిని ఓడించి తీరతామని తమ్ముళ్ళు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

అయితే బాబు పర్యటనతో గుడివాడలో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చిందనే చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అర్ధరాత్రి వరకు బాబు పర్యటన సాగిందంటే..పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి బాబు పర్యటన వల్ల గుడివాడలో కొడాలి నానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే కొంత ప్రభావమైతే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే నాలుగుసార్లు వరుసగా గెలిచిన నాని..ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే గుడివాడకు పెద్దగా ఏం చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది.

ఇప్పుడు అది టి‌డి‌పికి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది..అలాగే బాబు పర్యటనతో మరింత ప్లాన్ కావచ్చు. ఇక ఇక్కడ బలమైన అభ్యర్ధిని టి‌డి‌పి నుంచి నిలబెడితే..కొడాలి నానికి చెక్ పెట్టవచ్చు. అభ్యర్ధి సరిగ్గా లేకపోతే కొడాలిని ఓడించడం సాధ్యం కాదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version