జబర్దస్త్ నుంచి హైపర్ ఆది వెళ్లిపోయినట్టేనా..?

-

ఈటీవీలో గత తొమ్మిది సంవత్సరాలకు పైగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది జీవితాలకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలా దారుణంగా ఈ షో టి ఆర్ పి రేటింగ్ పడిపోయిందని చెప్పవచ్చు. ఈ సమయంలో మల్లెమాలవారు కూడా మంచి కమెడియన్స్ ను తీసుకొచ్చి మళ్ళీ రేటింగ్ పెంచే ప్రయత్నం చేయాలి. కానీ ఈ సమయంలో హైపర్ ఆది వంటి వారు వెళ్ళిపోతున్నా కూడా చూస్తూ ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

జబర్దస్త్ నుంచి ఎంతోమంది ఆణిముత్యాలు లాంటి కమెడియన్స్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మరి గత కొద్దిరోజుల నుంచి జబర్దస్త్ లో హైపర్ ఆది కూడా కనిపించడం లేదు. అనసూయ ఉన్నప్పుడు బాగా తనపై పంచులు వేస్తూ భారీ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న హైపర్ ఆది.. ఇప్పుడు కనిపించకపోవడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కి ఆది గుడ్ బై చెప్పాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మల్లెమాల వారి యొక్క ఇతర షోలలో కనిపిస్తున్న హైపర్ ఆది.. జబర్దస్త్ లో మాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యకరం.

ఇప్పటికే సోషల్ మీడియాలో హైపర్ ఆది కోసం డిమాండ్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. గతంలో మాదిరిగా జబర్దస్త్ లో మళ్లీ హైపర్ ఆది రీ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. తాజాగా సద్దాం, యాదమ్మ రాజు టీం ని తీసుకురావడంతో హైపర్ ఆది టీం లేనట్లే అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి జబర్దస్త్ నుంచి హైపర్ ఆది నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పది రోజుల్లో ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అలాంటి సమయంలో హైపర్ ఆది లేకపోవడం మరింత సంచలనానికి దారితీస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version