జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర ఈనెల 18వ తేదీ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ సందర్భంగా జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్ చేపట్టే కవులు రైతు భరోసా యాత్రను అడ్డుకోవద్దని కోరారు.
కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకు లక్ష చొప్పున అందించబోతున్నారని.. కౌలు రైతుల భవిష్యత్తు కోసం, ఈ గొప్ప కార్యక్రమాన్ని దయచేసి ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించవద్దని కోరారు. అడ్డంకులు, అలజడులు సృష్టించకండి అని ప్రభుత్వానికి, పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నామని జనసేన ట్వీట్ చేసింది. జనసేన పార్టీ ఎల్లప్పుడు చట్టాన్ని గౌరవిస్తుంది అన్నారు. అధికార యంత్రంతో కలిసి పనిచేస్తుందన్నారు నాదెండ్ల.
కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు, వారికి లక్ష రూపాయల చొప్పున మా అధినేత శ్రీ @PawanKalyan గారు అందించే కౌలు రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు దయచేసి ప్రయత్నించకండి, అడ్డంకులు, అలజడులు సృష్టించకండి అని ప్రభుత్వానికి, పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. pic.twitter.com/d15rd9Q1g4
— JanaSena Party (@JanaSenaParty) December 17, 2022